పేదలకు నాణ్యమైన వైద్యంకై పల్లె దవాఖాణలు

నవతెలంగాణ – నసురుల్లాబాద్
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు వైద్య సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం పల్లె దవఖానాలను ఏర్పాటు చేసి చేయడం జరుగుతున్నదని ఎంపీపీ పాల్త్య విఠల్ , మండలం పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ నసురుల్లాబాద్ మండల కేంద్రానికి పల్లె దవాఖాన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. పల్లె దవాఖాన కు నిధులు మంజూరు కు కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ దవాఖానాలు శనివారం మినహా అన్ని రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని, అకాల వర్షంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అర్ధరాత్రి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉంది రైతులకు అండగా ఉన్నారని గుర్తుచేశారు.అకాల వర్షం కు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంకు నివేదిక పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల విక్రయించిన ధాన్యం డబ్బులను వారం రోజుల్లో రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలే తమ సమస్యల గుర్తించి పరిష్కారం చేస్తున్న స్పీకర్ కో చానల్ శ్రీనివాస్ రెడ్డికి డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ నెంబర్ మాజీ మజీద్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ ఫోరం కన్వీనర్ రాము, గ్రామ పార్టీ అధ్యక్షుడు కంది మల్లేష్, నాయకులు ప్రతాప్ సింగ్, మైషగౌడ్, నర్సింలు గౌడ్, భూమయ్య, గంగారం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love