సేవారంగంలో ర్యాకల శ్రీనివాస్ కు డాక్టరేట్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన యువ నాయకులు ర్యాకల శ్రీనివాస్ గత కొంతకాలంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ కు చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ యూనివర్సిటీ ర్యాకల శ్రీనివాస్ చేస్తున్న సేవలను గుర్తించి శనివారం డాక్టరేట్ పట్టాను యూనివర్సిటీ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సేవారంగం డాక్టరేట్ అవార్డు గ్రహీత  ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి, డాక్టరేట్ ప్రధానం చేసిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ యూనివర్సిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love