– రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో రైతు భరోసా రానివారందరికీ ఈ నెల 9లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, ఇది వరకు చెప్పినట్లుగానే ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఆయన చీరకట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కాలని, అక్కడ జీరో టికెట్ ఇస్తారని.. అప్పుడు అమలవుతున్నాయో లేదో ఆయనకు తెలుస్తుందని అన్నారు. ఆదిలాబాద్‌లో సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఐదింటిని అమలు చేశామని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, మంత్రి సీతక్క, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జు, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, రేఖానాయక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.