జులై నుంచి రైతు భరోసా: తుమ్మల

నవతెలంగాణ – హైదరాబాద్: వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసేవారందరికీ ‘రైతు భరోసా’ అమలు చేయనున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న, సన్నకారు రైతులందరికీ రుణసహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Spread the love