సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ఎస్‌.హరీశ్‌

Department of Information and Civic Relations S. Harish as Special Commissioner– రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ఎస్‌.హరీశ్‌ నియమితులయ్యారు. ఐ అండ్‌ పీఆర్‌కు ప్రస్తుతం ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న ఎం.హనుమంతరావును యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియమించడంతో ఆ స్థానంలోకి రెవెన్యూశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న హరీశ్‌ను బదిలీ చేశారు. పురపాలకశాఖ డైరెక్టర్‌ అండ్‌ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి నియమితులయ్యారు. వీరితో కలిపి రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
ఐఏఎస్‌ అధికారులు నారాయణరెడ్డి-రంగారెడ్డి కలెక్టర్‌గా, త్రిపాఠి-నల్లగొండ కలెక్టర్‌ , మంద మకరందు- సీసీఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, జెడ్‌.కె. హనుమంతులు-పర్యాటకశాఖ డైరెక్టర్‌, దేవాదాయశాఖ సంచాలకులుగా అదనపు బాధ్యతలు, శశాంక- రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్‌ , హరీశ్‌ – విపత్తు నిర్వహణశాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, వినరు కృష్ణారెడ్డి-ఆర్‌ అండ్‌ ఆర్‌ భూసేకరణ కమిషనర్‌, ఆయేషా మస్రత్‌ – వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి, వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్‌ చక్రవర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కె. చంద్రశేఖర్‌రెడ్డి-డెయిరీ కార్పొరేషన్‌ ఎండీ, ఎస్‌.దిలీప్‌కుమార్‌-నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌, సోని బాలదేవి- క్రీడాశాఖ సంచాలకులు (అదనపు బాధ్యతలు), కొర్రా లక్ష్మి-రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీ, స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మికి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు.
ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు
రాష్ట్రంలో ముగ్గురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఎన్‌.క్షితిజ – ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ, సుభద్రా దేవి – జీహెచ్‌ఎంసీ అర్బన్‌ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్‌, జి.జ్ఞానేశ్వర్‌ – వికారాబాద్‌ డీఎఫ్‌ఓగా నియమితులయ్యారు.

Spread the love