రెంజల్ మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ- రెంజల్:

రెంజల్ మండలంలోని కళ్యాపూర్, దూపల్లి, మౌలాలి తాండ, బోర్గం గ్రామాలలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళ్యాపూర్ గ్రామంలో సర్పంచ్ కాశం నిరంజనీ సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు గాండ్ల నాగరాజ్, కిన్నెర మోహన్, ప్రధాన కార్యదర్శి ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దూపల్లి గ్రామంలో సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, శేషు గారి భూమారెడ్డిల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలోని పెద్ద ఎత్తున నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకలను గ్రామస్తులందరూ వీక్షించడం విశేషం. బోర్గం గ్రామంలో సర్పంచ్ పార్ధవాని సాయి రెడ్డి, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మౌలాలి తండా సర్పంచ్ జాదవ్ సునీత బాబు నాయక్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. గత రెండు మూడు రోజులుగా వివిధ రకాల పూలను సేకరించి మహిళలు అత్యంత తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బతుకమ్మలను తయారు చేశారు. దూపల్లి గ్రామంలో పోటీ పడుతూ మహిళలు బతుకమ్మలను తయారు చేయడం జరిగింది.
Spread the love