సేఫ్టీ మోకులు గీతా కార్మికులకు అందరికీ పంపిణీ చేయాలి 

Safety knees should be distributed to all Gita workers– కేజీ టీఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు పులి నర్సయ్య గౌడ్ 
-కాటాపూర్, గంగారం పుర వీధుల గుండా భారి బైక్ ర్యాలీ..
నవతెలంగాణ – తాడ్వాయి 
గీత కార్మికులు తాడిచెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోకుండా రక్షణగా ఉండటానికి ఇచ్చే సేఫ్టీ మోకు లు, తాడిచెట్టు ఎక్కే గీతా కార్మికులకు అందరికీ అందించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాటాపూర్ గంగారం గ్రామాలలో వీధుల వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా వృత్తి చేసుకునే ప్రతి గీత కార్మికులకు సేఫ్టీ మోకు లు అందించాలని తెలిపారు. అలాగే గీత కార్మికులకు ఇచ్చే వృద్ధాప్య పింఛను కూడా రూ.2000 నుండి రూ.4000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ఐదు ఎకరాల స్థలం కొనిచ్చి అందులో తాటి, ఈత మొక్కలు నాటేలా ఏర్పాటు చేయాలన్నారు. గీత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రత్యేక గుర్తింపు కల్పించాలన్నారు. బైకులు అందించాలన్నారు. ఎన్నికల సమయంలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలు అన్నిటిని వెంటనే అమలు చేయాలని తెలిపారు. ఈత కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం సీనియర్ నాయకులు బెల్లంకొండ రోశయ్య, మాజీ సర్పంచ్ పులి పెద్ద నరసయ్య గౌడ్, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మల సమ్మయ్య గౌడ్, గీత కార్మికులు గండు సదయ్య, రంగు లాలయ్య, బెల్లంకొండ నరేష్, రంగు సత్యనారాయణ, పాలకుర్తి బాబు, పులి రాజు, పులి రవి, ఉప సర్పంచ్ పాలకుర్తి మధు గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, పానుగంటి గణేష్, పాలకుర్తి రవి, గడ్డం మొగిలి, గండు మల్లయ్య, వడ్లకొండ వెంకన్న, రాజు, లింగాల వెంకన్న, నర్సయ్య, శంకర్, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love