నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షురాలిగా సాహూ శ్రీలత లక్ష్మీకాంతను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యదర్శి సంతోష్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆదివారం హైదరా బాద్‌లోని నాగోల్ ఎస్వీఎం హౌటల్లో నిర్వహించినటు వంటి ఐవీఎఫ్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షురాలిగా సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తాండూర్ మున్సిపల్ కౌన్సిలర్ వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలును ఉప్పల్ శ్రీని వాస్ ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యదర్శి, రొంపల్లి సంతోష్ ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు, చందా భాగ్యలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో నియామకపత్రం అందజేశారు. అలాగే జిల్లా కమిటీలో జిల్లా జనరల్ సెక్రట రీ కట్ట సరిత, జిల్లా కోశాధికారి నేమలిగా స్వాతి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమాజీ సరిత జిల్లా సెక్రెటరీ భానురు స్వాతి నియమించారు. ఈ సందర్భంగా సావు శ్రీలత లక్ష్మికాంత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఐవీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఐవీఎఫ్‌ను అభివృద్ధికి తన వంతు పూర్తి సహ కారం అందిస్తామన్నారు.