ఇద్దరు పిల్లల్ని ఆదుకున్న హీరో సాయి ధరమ్ తేజ్

నవతెలంగాణ-హైదరాబాద్ : సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. ఇద్దరు చిన్నారుల వైద్య చికిత్సకు ఆయన అండగా నిలిచినట్లు సినిమాటోగ్రఫర్ ఆండ్రూ బాబు తెలిపారు. ‘సూర్యాపేట జిల్లాలోని చార్లెట్ అనాథాశ్రమంలోని ఇద్దరు పిల్లలకు ట్రీట్మెంట్ అవసరమైంది. నాకు వెంటనే గుర్తొచ్చిన పేరు సాయి ధరమ్ తేజ్. ఇలా చెప్పగానే ఆయన అలా చికిత్సకు సాయమందించారు’ అని వెల్లడించారు. పిల్లలందరూ తేజ్కు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో చేయడం విశేషం. ఇదిలా ఉంటే…..విరూపాక్ష సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఇందులో గాంజా శంకర్ గా తేజ్ మాస్ లుక్ వేరే లెవల్లో ఉంది.

Spread the love