సాయి హర్ష ముందంజ

జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ
హైదరాబాద్‌ :
జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ ఆటగాడు సాయి హర్ష ముందంజ వేశాడు. సోమవారం మోయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వేదికగా జరిగిన అండర్‌-15 బార్సు పోటీల్లో సయాన్‌ చౌదరిపై సాయి హర్ష 3-1తో మెరుపు విజయం నమోదు చేశాడు. నాలుగు సెట్ల మ్యాచ్‌లో హర్ష అలవోకగా గెలుపొందాడు. దుల్కన్‌ వత్సల్‌ (హర్యానా) 3-1తో సావంత్‌ మయూరిశ్‌ (మహారాష్ట్ర)పై గెలుపొందగా.. ఇషాన్‌ కుమార్‌ 3-0తో చందన్‌ (గోవా)పై విజయం సాధించాడు. అండర్‌-15 గర్ల్స్‌ విభాగంలో ఫిజా పవార్‌ 3-2తో శ్రీజ చక్రవర్తి (బెంగాల్‌)పై, అన్వీ గుప్త (మహారాష్ట్ర) 3-2తో సుమేధ (కర్ణాటక), మౌబోని చటర్జీ (గుజరాత్‌) 3-0తో ఈషా సంజన పోకల (ఏపీ)పై విజయాలు సాధించారు.

Spread the love