– లయన్ గాదె మాధవ రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలానికి చెందిన పెరుమాళ్ళ నరసింహారావు హైమావతి ప్రధమ కుమార్తె కుమారుడైన గ్రందే సాయి కృష్ణ యూపీఎస్‌సీలో ఈ మధ్యన వెలువడిన వాటిలో 292 ర్యాంకు సాధించి హౌరా అనిపిం చాడు. ఆదివారం భద్రాచలం వచ్చిన సాయి కృష్ణకు ప్రముఖ సంఘ సేవకులు పట్టణ ప్రముఖులు ఎల్‌ఎన్ గాదె మాధవరెడ్డి, వారి బంధువులు, స్నేహితులు వెంకటేశ్వర సేవా సమితి మహిళా మణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికి, హారతులు ఇచ్చి పూలదండలు, శాలువతో సత్కరించి, స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అత్యున్నతమైన చదువు ఒక జిల్లాకి అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్‌గా ఎంతోమంది పేద ప్రజలకి సర్వీస్ చేసే భాగ్యం అదృష్టం కలిగిందని అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజల కష్టాలు తీర్చేలా కష్టపడాలని ఎల్లవేళలా రాముడు ఆశీస్సులు మీ మీద ఉండాలని, అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, మేనమామలు, మేనత్తల ఆశీస్సులతో చక్కటి విజయాన్ని సాధించిన సాయి కృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో చక్కటి అవకాశాల్ని అందిపుచ్చుకొని అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అక్కడికి విచ్చేసినటు వంటి బంధువులు, స్నేహితులు, మిత్రులు ఆశీర్వచనాలు అందించారు. మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గాదె మాధవరెడ్డి. అమ్మమ్మ హైమావతి, తాతయ్య నరసింహారావు, మేనమామ హరీష్ దంపతులు, మేనమామ ఉదరు భాస్కర్ దంపతులు, తాతయ్య దేవస్థానం అధికారి రామారావు దంపతులు పాల్గొని ఆశీర్వదించారు.