సాయిచంద్ హఠాన్మరణం దిగ్బంధ కారం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్,తెలంగాణ ఉద్యమ కారుడు,గాయకుడు సాయిచంద్ హఠాన్మరం తివ్ర దిగ్బంధించి తీవ్రంగా కలిచి వేసిందని ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్,బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్ ప్రజా ప్రతినిధులు అన్నారు.గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సాయిచంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిచంద్
తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప స్ఫూర్తి వంతమైన పాత్ర పోషించి,సమాజానికే ఆదర్శంగా నిలిచిన సాయి చంద్ భౌతికంగా మనకు దూరమైనా,తన గాత్రం రూపంతో మన మధ్య సజీవంగా ఎల్లప్పుడూ ఉంటాడని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమం లో సినియర్ నాయకులు పాశం కుమార్, కచ్చకాయల శ్రీనివాస్, సంఘం కిష్టయ్య, పరుశురాం నాయక్, రమేష్ నాయక్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love