నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సైఫ్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డిశ్చార్జ్‌కు సంబంధించిన పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.