మహిళలకు ఉచిత ప్రయాణ..సీఎం రేవంత్ రెడ్డితో సజ్జనార్ సమావేశం..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. రేపటి (శనివారం) నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు సజ్జనార్‌ సీఎంతో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు నేడు ఖరారు కానున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇప్పటికే కర్ణాటక వెళ్లింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీపై భారం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిబంధనలు, నిబంధనలపై అధ్యయనం చేశారు. వివరాలను ఎండీ సజ్జనార్‌కు అందజేశారు. వాటి ఆధారంగా తెలంగాణ ఒక విధానాన్ని రూపొందిస్తుంది. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత పూర్తి ప్రకటన వెలువడనుంది. అసలు ఏఏ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తారు. రేంజ్ విధిస్తారా, ఏ గుర్తింపు కార్డులు చూపించాలనే దానిపై క్లారిటీ రానుంది. అసలు తెలంగాణ ప్రజలకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించనున్నారా? లేక ఏపీ ప్రజలకు కర్ణాటకలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినప్పుడు బస్సుల కొరత తీవ్రంగా ఉండేది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్న వాదన కూడా ఉంది. తెలంగాణలో ఇప్పటికే 40 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ సంస్థకు రావాల్సిన ఆదాయం 4 కోట్లు తగ్గుతుంది. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో ఆర్టీసీ విధి విధానాలపై ఫ్రీ మహిళా జర్నీపై చర్చించనున్నారు సీఎం రేవంత్.

Spread the love