సలార్‌ ట్రైలర్‌ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభాస్‌ ప్రధాన పాత్రలో, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్‌’ చిత్రం డిసెంబర్‌ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. 5 భాషల్లో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, పృధ్వీ రాజ్‌, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Spread the love