సూర్యాపేట బాల్ భవన్ డ్రాయింగ్ మాస్టారు దాసరి ఎల్లయ్యకి సన్మానం..

నవతెలంగాణ-హైదరాబాద్ : డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ రమేష్ గారు జాతీయ స్థాయిలో నిర్వహించిన వన్ డే ఆర్ట్ ఫెస్ట్ కార్యక్రమం పోటీలలో బాల్ భవన్ స్టూడెంట్స్ పాల్గొని ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ సాధించిన అభి షేక్ వర్మ , ద్వితీయ స్థానం సిల్వర్ మెడల్ సాధించిన సభాఖానం, శగుప్త అమ్రీన్ , సర్టిఫికెట్ లు సాధించిన అక్షర,మహేష్,శశాంక్, జషిక విజేతలకు నేడు సూర్యాపేట బాల్ భవన్ లో అభినందించడం జరిగింది, అనంతరం స్టూడెంట్స్ ను తీర్చి దిద్దిన బాల్ భవన్ డ్రాయింగ్ మాస్టారు దాసరి ఎల్లయ్య ను డైరెక్టర్ రమేష్ గారు ఈనెల మార్చి 2 న ఏర్పాటు చేసిన గుంటూరు కె ఎల్ యూనివర్సిటీ వడ్డేశ్వరం ఆడిటోరియంలో ఘనంగా సన్మానించినందున నేడు బాల్ భవన్ లో ముఖ్య అతిథిగా హాజరైన కళాకారులు బుర్రి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అభినందిస్తూ సత్కరించడం జరిగింది. తదుపరి అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాల్య దశ నుండే బాధ్యతగా కళల్ని నేర్చుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలి అని,నైపుణ్యాలను చాటి చెప్పాలని అన్నారు. ఈ సందర్భంను ఉద్దేశించి బాల్ భవన్ బండి రాధాకృష్ణ రెడ్డి ప్రసంగిస్తూ పలు అవకాశాలని స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,డ్రాయింగ్ మాస్టారు కి, స్టూడెంట్స్ కి అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ సింగ్,అనిల్,సాయి, వీరు నాయుడు,స్టూడెంట్స్ ,పేరెంట్స్ పాల్గొన్నారు.

Spread the love