నవతెలంగాణ-కొత్తగూడెం: ప్రజల సమస్యలనే అస్త్రాలుగా చేసుకొని ఆటపాటలతో ప్రజలను చైతన్య పరుస్తూ చివరి వరకు ప్రజల వెంట నడిచిన యోధుడా నీకు లాల్ సలాం అని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా గ్రామ కార్యదర్శి ముద్రబోయిన కొమ్మాలు అన్నారు. సోమవారం మండలంలోని గుండంపల్లి గ్రామపంచాయతీ పరిధి తిమ్మాపురం గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాట యోధుడా లాల్ సలాం అంటూ గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పెనుక సతీష్, గట్టి సుధీర్, శోభన్, గ్రామ పెద్దలు పెద్ద వీరస్వామి, సదానందం, స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.