మైక్రోసాఫ్ట్‌ గూటికి శామ్‌ ఆల్ట్‌మన్‌

న్యూయార్క్‌ : ఓపెన్‌ఎఐ మాజీ సిఇఒ శామ్‌ ఆల్ట్‌మన్‌ దిగ్గజ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నారు. ఆల్ట్‌మన్‌ తమ కంపెనీ నూతన కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారని మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్యా నాదేళ్ల సోమవారం వెల్లడించారు.
ఆల్ట్‌మన్‌తో పాటు ఓపెన్‌ఎఐకి ప్రెసిడెంట్‌గా వ్యవహారించిన బయటకు వచ్చిన గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ సైతం తమతో కలిసి పని చేయనున్నారని తెలిపారు. వీరు ఇరువురు తమ ఎఐ బృందానికి నేతృత్వం వహించనున్నారన్నారు. వారి విజయానికి కావాల్సిన వనరులు సమకూర్చనున్నామని తెలిపారు.

Spread the love