సమరమే..

– పేదలకిచ్చే రూ.3లక్షల గృహలక్ష్మి నిధులు సరిపోవు
– బస్సు యాత్ర ముగిసేలోపు సమస్యలు పరిష్కరించాలి
– భూపోరాట పేదలకు పట్టాలివ్వాల్సిందే : ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ – హనన్‌పర్తి/కరీంనగర్‌
ప్రాంతీయ ప్రతినిధి / గోదావరిఖని
పేదలు ఇల్లు కట్టుకునేందుకు ప్రకటించిన గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలం ఉండి, రేషన్‌కార్డు ఉన్నవారికే రూ.3లక్షలు ఇస్తామంటే ఇంటిస్థలం లేని పేదలు ఎక్కడికిపోవాలని, సొంత స్థలం ఉన్నా.. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇంటి నిర్మాణం సాధ్యమవుతుందా అని ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య ప్రశ్నించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాల సాధన కోసం ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర గురువారం ఉదయం హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో గుడిసెలు వేసుకున్న కేంద్రాన్ని సందర్శిం చింది. అనంతరం అక్కడినుంచి సిద్దిపేట పట్టణం మీదుగా సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి యాత్ర చేరుకుంది. అక్కడ నగరంలో చేపట్టిన భూపోరాట పేదలను యాత్ర బృంద సభ్యులు కలిశారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో వేదిక జిల్లా కన్వీనర్‌ వేల్పుల కుమారస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే అన్ని వస్తాయని చెప్పిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేండ్లు పూర్తయినప్పటికీ నిరుపేదలకు కనీసం ఇండ్లు నిర్మించలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వాలకు సోయిలేకనే నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆడవారికి తడక చాటు స్థలం లేని దీనపరిస్థితిలో ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిరుపేదలు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ి ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మిస్తామని మోసం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్‌ వ్యాపారులు, భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే రాబోయే రోజుల్లో పేదలకు కనీసం 100 గజాల ప్రభుత్వ స్థలం లేకుండా పోతుందని గుర్తించారని అన్నారు. అందుకే ఇండ్లు లేని నిరుపేదలు 100 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుంటున్నారని అన్నారు. పేదలు ఇల్లు కట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రజెండా ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 61కేంద్రాల్లో సాగుతున్న భూపోరాట కేంద్రాలను సందర్శిస్తూ వారికి మద్దతుగా బస్సుయాత్ర సాగుతోందని తెలి పారు. ఈ యాత్రలో వారితో బస చేసి వారి కష్టాలు, సమస్యలు అర్థం చేసు కుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల విషయమై నిర్ధిష్ఠ కాల పరిమితితో విధివిధానాలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ భూపోరాటాల వేదికల నుంచే పేదలతో కలిసి సమరశీల పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. బహిరంగసభల్లో కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి టి.స్కైలాబ్‌బాబు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, వృత్తిదారుల సంఘం నాయకులు పి.ఆశయ్య, సీఐటీయూ కోశాధికారి వంగూరి రాములు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి జగదీష్‌, డీవైఎఫ్‌ఐ్‌ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, సింగరేణి కాలరీస్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) అధ్యక్షులు టి.రాజారెడ్డి, ప్రజానాట్య మండలి అధ్యక్షులు వేముల ఆనంద్‌, వివిధ జిల్లాల ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా… ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు బస్సుయాత్రలో భాగంగా గోదావరిఖనిలో గురువారం సాయంత్రం చేపట్టిన సభకు చేరుకుని పేదల నుద్దేశించి మాట్లాడుతున్న సమయంలోనే వర్షం జోరందుకుంది. అయిన ప్పటికీ అదే వర్షంలో నేతలు పేదలను ఉద్దేశించి ఇండ్లు, ఇండ్ల స్థలా ల విష యమై ప్రభుత్వాన్ని నిగ్గదీస్తూ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో సభలో పాల్గొన్న పేదలందరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నాయకులతో పాటే తడుస్తూ వారి ప్రసంగాన్ని వింటూ పోరాట స్ఫూర్తిని చాటుకున్నారు.

Spread the love