పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో సంబురంగా జండా వేడుకలు

నవతెలంగాణ – ఆర్మూర్: పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో సంబురంగా జండా వేడుకలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం పట్టణం లోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేటు పాఠశాలలతో పాటు వివిధ గ్రామాలలో జెండా సంబరాలు ఘనంగా నిర్వహించినారు. పట్టణంలోని ఆర్డీవో, ఏసీ పి, డి ఎల్ పి ఓ ఆర్ డబ్ల్యు ఎస్, ఎంపీడీవో, తహసిల్దార్ ,పంచాయతీ రాజ్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ,,మున్సిపల్ కార్యాలయం,, ప్రభుత్వ ఆసుపత్రి ల యందు వివిధ శాఖల అధికారులు ,,నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణలు చేసినారు.. మండలంలోని పెర్కిట్ ,పి ఫ్రీ ,గోవింద్ పెట్, ఆలూరు, సొసైటీల యందు చైర్మన్లు పెంట బోజారెడ్, సోమ హేమంత్ రెడ్డి, బంటు మైపాల్, బోజా రెడ్డి లు జెండా ఆవిష్కరణలు చేయగా, మండలంలోని వివిధ గ్రామాల యందు సర్పంచులు ఇందూర్ సాయన్న,, దేగాం గంగారెడ్డి, ఆశాపురం శ్రీనివాస్ రెడ్డి, మధువర్మ, బంటు దయానంద్, కొత్తపల్లి లక్ష్మి లింబాద్రి, సట్లపల్లి సవిత గణేష్, సింగిరెడ్డి మోహన్, మధువర్మ, తదితరులు జెండా ఆవిష్కరణ చేసినారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల యందు జెండా ఆవిష్కరణలో మంజుల, లిల్లీపుట్ రామకృష్ణ, శ్రీ భాషిత సుందర్, నలంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love