15 పాప్-అప్ స్టోర్స్ ను భారతదేశంలో ఆవిష్కరించనున్న Samsung

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటీవల విడుదల చేసిన Galaxy Z Fold5, Galaxy Z Flip5, Galaxy Watch6 సిరీస్ మరియు Galaxy Tab S9 సిరీస్‌ల గురించి చైతన్యం కలిగించేదుకు భారతదేశం అంతటా 15పాప్-అప్ స్టోర్స్ ను తెరవనున్నట్లు Samsung ఈ రోజు ప్రకటించింది. మొదటి దశలో, ఢిల్లీ-NCR, ముంబై, బెంగుళూరు మరియు హైదరాబాద్‌ వంటి అభివృద్ధి చెందిన టియర్ 1 నగరాల్లో ఐదు పాప్-అప్ స్టోర్లు ఏర్పాటు చేయబడ్డాయి. తదుపరి, ఈ పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి Samsung ఈ పాప్-అప్ స్టోర్‌లను టియర్ II నగరాలతో సహా ఇతర ప్రదేశాలకు విస్తరిస్తుంది. Samsung పాప్-అప్ స్టోర్స్ ను సందర్శించే వినియోగదారులు Samsung వారి అయిదవ తరానికి చెందిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అనుభవం పొందడమే కాకుండా, గాలక్సీ శ్రేణి పని చేస్తుండటం కూడా చూడవచ్చు. ఈ పాప్-అప్ స్టోర్స్ లో, వినియోగదారులు ప్రత్యేకమైన ప్రత్యక్ష డెమో సమావేశాల్లో కూడా చేరుతారు మరియు కొన్ని ఉత్తేజభరితమైన బహుమతులను కూడా అందుకునే అవకాశం పొందుతారు. కొత్త Galaxy Z సీరీస్ గురించి ఆసక్తికరమైన సలహాలు మరియు ఉపాయాలు కూడా తెలుసుకుంటారు. ఈ ఏడాది, Samsung కు చిన్న పట్టణాలు మరియు నగరాలు నుండి ఫోల్డబుల్స్ కోసం ఎక్కువ డిమాండ్ వచ్చింది మరియు ఫోల్డబుల్ టెక్నాలజీ అనుభవించాలని కోరుకునే వినియోగదారుల సమూహానికి చేరుకోవడంలో కొత్త పాప్-అప్ స్టోర్స్ Samsung కు సహాయపడతాయి. Samsung ఇటీవల ప్రారంభించిన Galaxy ZFold5 మరియు Z Flip5 స్మార్ట్ ఫోన్స్ భారతదేశంలో గొప్ప ప్రారంభాన్ని సాధించాయి, 150,000 ప్రీ-బుకింగ్స్ పొందాయి, ఇది ఇంతకు ముందు తరం ఫోల్డబుల్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువ. భారతదేశంలో విక్రయించబడుతున్న Galaxy Z Fold5 మరియు Z Flip5 Samsung వారి నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయి. పాప్-అప్ స్టోర్స్ లో ఉత్పత్తులు Galaxy Z Flip 5 & Z Fold 5 – Galaxy Z flip 5 అనేది ఉత్తమమైన జేబులో అమరిపోయే డివైజ్. ఇది వినియోగదారుల విలువైన అన్ని ఫీచర్స్ ను సమర్థవంతం చేస్తుంది, అందుబాటులో ఉన్న అత్యంత సౌకర్యవంతమైన స్వీయ-వ్యక్తీకరణ సాధనాన్ని సృష్టిస్తుంది. గాలక్సీ Z Fold 5 అనేది అన్ని కొత్త అవకాశాలను తెరవడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి అతి పెద్ద స్క్రీన్‌ను అందిస్తూ, జత కట్టడానికి బహుముఖ ప్రజ్ఞతో కూడిన శక్తివంతమైన స్మార్ట్ ఫోన్. Galaxy Watch 6 & Watch 6 Classic – ప్రతిరోజూ మరియు రాత్రి పూట ఆరోగ్యకరమైన అలవాట్లను రూపొందించుకోవడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి రూపొందించబడింది, Galaxy Watch 6 సిరీస్ సమగ్రమైన ఆరోగ్య ఆఫరింగ్స్ మరియు శక్తివంతమైన పనితీరును శుద్ధి చేయబడిన మరియు సొగసైన డిజైన్ మరియు మరింత ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో అందిస్తుంది. Galaxy Buds2 Pro – పనితీరుతో ఇది మెరుగుపడింది, Galaxy Buds 2 Pro అనేది ప్రతి జీవనశైలి, అవసరాలు మరియు వ్యక్తిత్వానికి సరిపోయే ప్రీమియం ఆడియో అనుభవాలను కోరుకునే వారికి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన యాక్ససరీ. గాలక్సీ బుక్ 3 ప్రో 360 – Galaxy Book 3 Pro 360 అంతా సన్నని, తేలికైన మరియు సొగసైన డిజైన్‌లో ఒక సాటిలేని Samsung గాలక్సీ వ్యవస్థ అనుభవాన్ని మరియు అధిక-పనితీరు గల కంప్యూటింగ్‌ను అందిస్తోంది. Galaxy Tab S9 Ultra – అధిక పనితీరు మరియు సొగసైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన Galaxy Tab S9 అల్ట్రా అనేది టాబ్లెట్‌కి ప్రీమియం మరియు సాటిలేని సృజనాత్మక అనుభవాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందింది.

Spread the love