శానాయిపల్లి గొర్రెల వ్యాపారి మృతి

నవతెలంగాణ – రేవల్లి: శానాయిపల్లి గ్రామంలో, కత్తె బీరయ్య అనే వ్యక్తి (శనివారం) రాత్రి తన కుటుంబంతో భోజనం చేసి అందరూ నిద్రిస్తున్న అర్థరాత్రి సమయంలో, తన ఉంటున్న ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఉన్నాడు, అది చూసిన తల్లి, ఉదయం 3 గంటలకి లేచి చూడగా కొడుకు మరణించి ఉన్నాడని ఇంటి పక్కన ఉన్న స్థానికులకు తేల్పడంతో, స్థానికులు రేవల్లి ఎస్సై శివకుమార్ కి తెలియపరిచారు, ఎస్ఐ శివకుమార్ కథన ప్రకారం కత్తె బీరయ్య గతంలో కూలి పనులు చేసే వారు అని, తన భార్య పది సంవత్సరాల కిందట మరణించడంతో తండ్రి బీరయ్య తన పిల్లల్ని భవిష్యత్తు కోసం, గత ఆరు నెలల నుంచి గొర్రెల వ్యాపారం చేసేవాడని ఇందులో బాగా నష్టం రావడంతో, అప్పుల బాధ వల్ల మనస్థాపానికి గురై, ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడని, ఈయనకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారని, ఎస్ఎస్ శివకుమార్ తెలిపారు, దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామన్నారు.

Spread the love