సనాశ్రీ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ప్రస్తుత సీజన్లో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆళ్ళపల్లి మండల కేంద్రం ఎస్సీ కాలనీలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కామెళ్ళ సనాశ్రీ (9) అనే విద్యార్థిని ఇంటి ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణంగా మెరుగైన వైద్యం సకాలంలో అందక ఇటీవల టైఫాయిడ్ జ్వరంతో మరణించిన విషయం విదితమే. అందులో భాగంగా ఆ నిరుపేద కుటుంబానికి మంగళవారం ఆళ్ళపల్లి ఎంపీపీఎస్ తరుపున ప్రధానోపాధ్యాయులు భూక్యా రమేష్ 25 కేజీల బియ్యం, తునికిబండల గ్రామం జీపీఎస్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ నరేష్ నిత్యావసర సరుకులు అందజేశారు. దీనికి ముందు కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. మృతి చెందిన సనాశ్రీ స్థానిక ఎంపీపీఎస్ లో 4వ తరగతి విద్యార్థిని కాగా, ఆర్థిక సాయం చేసిన వారిలో టీచర్లు హైమావతి, జానకి సైతం ఉన్నారు.
Spread the love