అభివృద్ధి పనులకు రూ.10 లక్షలు మంజూరీ 

– జెడ్పీటీసీ కనగండ్ల కవిత 
నవతెలంగాణ- బెజ్జంకి 
మండల కేంద్రంతో పాటు కల్లేపల్లి, వడ్లూర్ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.10 లక్షలు జిల్లా పరిషత్ నిధుల మంజూరైనట్టు జెడ్పీటీసీ కనగండ్ల కవిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.6 లక్షలు,కల్లేపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన గుంటూర్ పల్లిలో రూ.లక్ష,వడ్లూర్ గ్రామంలో రూ.3 లక్షలతో హైమాస్ విద్యుత్ వీదీ దీపాల నిర్మాణ పనులకు నిధులు మంజూరైయ్యాయని త్వరలో పనులు ప్రారంభించనున్నట్టు జెడ్పీటీసీ కవిత తెలిపారు. ఆలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధుల మంజూరీ కోసం పాటుపడిన జెడ్పీటీసీ కవితకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,అయా గ్రామాల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love