తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక వేలం పాట

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అక్రమంగా తరలిస్తున్న ఇసుక డంపులను తాసిల్దార్ ఎంఏ ఖలీమ్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో తన్వీర్ అనే వ్యక్తి రూ.24 వేల200 రూపాయలకు ఇట్టి అక్రమ ఇసుకను దక్కించుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.19 వేల 500 రూపాయల వేలంపాట నిర్వహించగా అట్టి వేలంపాటలో ముగ్గురు పాల్గొనగా తన్వీర్ అధిక మొత్తంలో వేలం పాట పాడి దక్కించుకున్నారు. మూడు టిప్పర్ల ఇసుక, రెండు ట్రాక్టర్ల ఇసుకను కలిపి వేలంపాట పాడినట్లు తాసిల్దార్ పేర్కొన్నారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love