– ముంపు ప్రాంతాలను పరిశీలించిన మైనింగ్ అధికారులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
పెద్దవాగు ప్రాజెక్టు వరద ముంపు కారణంగా పంటపొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను మంగళవారం జిల్లా మైనింగ్ అధికారులు స్థానిక రెవిన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలసి పరిశీలించారు. జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్ కుమార్ గుమ్మడి వల్లి, నారాయణపురం, బచ్చువారిగూడెం, రంగాపురం, కొత్తూరు గ్రామాల పరిధిలోని పొలాల్లోని ఇసుక మేటలను పరిశీలించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశానుసారం పెద్దవాగు ప్రాజెక్ట్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నివేదికను కలెక్టర్ అందించనున్నట్లు ఆయన తెలిపారు.పేరుకుపోయిన ఇసుక మేటలు ద్వారా ఇసుకను సేకరించి ప్రభుత్వ ప్రాజెక్టు నిర్మాణాలు ఇతర కట్టడాలకు వినియోగపడుతుందో లేదో చూడాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో సందర్శించి ఇసుక మేటలను పరిశీలించామన్నారు. ఆయనతో పాటు స్థానిక తహశీల్దార్ కృష్ణప్రసాద్, హెచ్‌ఓ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ ఏఈఓలు ఆరేపల్లి సతీష్, షాకీరాబాను,రవీంద్ర తదితరులు ఉన్నారు.