పట్టపగలే ఇసుక అక్రమ రవాణా..

నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండల కేంద్రంలోని గౌరరం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగపుర్ వాగు నుండి శుక్రవారం పట్టపగలే ఇసుక ను అక్రమంగా రవాణా చేస్తున్న ఎం ఒక్క అధికారి పట్టించుకోలేదని స్థానికులు అవేదన వ్యక్తం చేశారు.అక్రమ రవాణా చేసే వారు రాత్రుళ్లో దొంగ చాటుగా తరలించుకుని పోయేవారు.కాని ఎన్నికల్లో అదికారులు బిజీగా ఉండటంతో తమకు అడ్డుఅదుపు చేసే వారుండరనే ఉద్దేశంతో అక్రమంగా రవాణా కు ఉదయం, సాయంత్రం, రాత్రి అనే సమయం చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు అనేకంగా ఉన్నాయి.మిట్ట మధ్యాహ్నం మండల కేంద్రంలో యదేచ్చగా రవాణా చేస్తు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.ఇక నైన అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Spread the love