నవతెలంగాణ -తాడ్వాయి: గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న బంధాల గ్రామానికి చెందిన ఆగబోయిన సంధ్య ను జిల్లా ప్రోగ్రాం అధికారి చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, వైద్యం అందిస్తున్నారు. ఆదివాసి విద్యార్థి ఆరోగ్యం తెలుసుకున్న మండల ప్రత్యేక అధికారి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య మంగళవారం ములుగు ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ జగదీష్, జిల్లా ప్రోగ్రాం అధికారి పవన్ కుమార్ తో కలిసి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని విషయంలో ప్రత్యేకత శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి, వైద్యం అందించాలని ఆస్పత్రి డి సి హెచ్ ఎస్ అండ్ సూపర్డెంట్ డాక్టర్ జగదీశ్ గారిని కోరారు. అవసరమైతే ప్రత్యేక వైద్యం నిమిత్తం నిమ్స్ హాస్పటల్ హైదరాబాద్, కు పంపించి మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.