జీతాలు ఇవ్వాలని ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన..

Sanitation workers protest in hospital to pay salaries..నవతెలంగాణ – అచ్చంపేట 
జీతాలు ఇవ్వాలని పట్టణంలోని  ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న మహిళా కార్మికులు శనివారం ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్ మల్లేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ మహిళా కార్మికులకు  ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, పండుగకు కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందన్నారు. అదేవిధంగా  మూడు సంవత్సరాలుగా విధుల్లో చేరిన నాటి నుండి పీఎఫ్ నిధులను అకౌంట్లో జమ చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వస్తున్న కనీసం వేతనాలు ఇవ్వకపోవడంతో ఎలా జరుపుకోవాలని కార్మికులు కాంట్రాక్టర్, ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వేతనాలు చెల్లించకపోతే 13.నుండి సమ్మెలోకి చేపడతామని హెచ్చరించారు. ఆస్పత్రి హెడ్ నర్స్ కు సమ్మె పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాములు, సయ్యద్, కార్మికులు కాశమ్మ, చెన్నమ్మ, పద్మ, గాయత్రి, సంధ్య, తిరుపతమ్మ, జయమ్మ, రేణుక ,చిట్టెమ్మ ,తదితరులు ఉన్నారు.
Spread the love