ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

నవతెలంగాణ-భిక్కనూర్
గ్రామాలలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని మండల పంచాయతీ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. సోమవారం మండలంలోని బస్వాపూర్, పెద్ద మల్లారెడ్డి, అయ్యవారిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 23 వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగుతాయని, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకొవాలని పంచాయతీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Spread the love