చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు..

Sankranti celebrations at Chaitanya School..నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలో ఉన్న చైతన్య విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ముగ్గులు, రంగోలి, గాలి పటాలు ఎగరవేశారు. సంక్రాంతి సెలవులలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించి గాలిపటాలను ఎగురవేయాలని పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Spread the love