నేటినుంచి స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు

Sankranti holidays for schools and colleges from todayనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు శనివారం నుంచి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నుంచి ఈనెల 17 వరకు ఏడురోజులపాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. శనివారం నుంచి ఈనెల 16 వరకు ఆరురోజులపాటు జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులుంటాయని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈనెల 18న పాఠశాలలు, 17న జూనియర్‌ కాలేజీల్లో తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి. సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థులకు తరగతులు నడిపితే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామని ప్రయివేటు పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది.

Spread the love