సంత్  సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

నవతెలంగాణ  – చివ్వేంల
సంత్ సేవ లాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అదేవిధంగా ఫిబ్రవరి 15  సెలవు దినంగా ప్రకటించాలని  సూర్యాపేట సేవాలాల్ సేన నియోజకవర్గ అధ్యక్షులు  ధారావత్ కృష్ణ నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలో  పాచ్చ నాయక్ తండాలో సేవాలాల్ సేన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ధరావత్ కృష్ణ నాయక్  పాల్గొని మాట్లాడారు. సంత్ సేవాలాల్ ఒక సంఘసంస్కర్త, బంజారాల ఆరాధ్యదైవం, ప్రకృతి ప్రేమికుడు, ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్ధారకుడు అన్నారు. భారతదేశంలో సుమారు 10 కోట్లకు పైచిలుకు జనాభా కలిగిన బంజారాలు ఏటా సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, కిషన్ నాయక్, మల్సూర్, రవి, వెంకటేష్, నాగు, రమేష్, లింగా తదితరులు పాల్గొన్నారు.
Spread the love