హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలి: సంతోష్ గుప్తా

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
హైదరాబాద్  పార్లమెంట్ ఎంపీగా  పోటీ చేసే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ గుప్తా మాజీ సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు. గతంలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరామని చెప్పారు. ఆయన రానున్న రోజుల్లో పార్టీ సంయున్నత అవకాశం పార్టీ కల్పిస్తుందని హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా అవకాశం కల్పిస్తే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని పార్టీ నాయకులం కలుపుకొని పోయి విజయం సాధిస్తామన్నారు. తనకు మాజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Spread the love