నవతెలంగాణ – డిచ్ పల్లి
గత 14 ఏళ్ల క్రితం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన సంతోష్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు లోలం సత్యనారాయణ అన్నారు.బుదవారం ఇందల్ వాయి మండలంలోని మల్లాపుర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మాజీ సర్పంచ్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ గత 14 ఏళ్ల క్రితం పాఠశాలకు వచ్చినప్పుడు 12 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రతి రోజు ప్రతి ఇంటికి సంతోష్ కుమార్ వెళ్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ఉన్న పాఠశాలను కాపాడుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడ లేని విధంగా గ్రామంలో ఇంగ్లీషులో విద్య బోధన చేయించడానికి గ్రామస్తుల సహకారం తీసుకుంటూనే గ్రామంలో ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు రప్పించి 100 పై చిలుకు పిల్లలకు విద్య బోధన చేయించారన్నారు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివని ఆయన అన్నారు. వీధి నిర్వహణలో భాగంగా బదిలీలు సహజమని ఒకే చోట 14 ఏళ్ల పటు అద్యపక వృత్తిని నిర్వర్తించి డిచ్పల్లి మండలంలోని గొల్లపల్లి ప్రథమిక పాఠశాలకు గత పది రోజుల క్రితం బదిలీపై వెళ్లారని, అక్కడ కూడా పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని లోలం సత్యనారాయణ అన్నారు. అనంతరం పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జల్లెల శ్రీనివాస్, పంపడి రాజమోహన్, ఎస్ సుదర్శన్, పి శ్రీకాంత్ ,కవిత, మౌనిక ,శారద తోపాటు తదితరులు పాల్గొన్నారు.