మృతుని కుటుంబానికి శరత్ రావు పరామర్శ..

నవతెలంగాణ -బెజ్జంకి 
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ ముక్కీస వెంకట్ రెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే.. గురువారం మృతుడు వెంకట్ రెడ్డి చిత్రపటానికి పీఏసీఎస్ చైర్మన్,మాజీ జెడ్పీటీసీ తన్నీరు శరత్ రావు పూలమాల వేసి నివాలర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఏఎంసీ చైర్మన్ అక్కరవేణీ పోచయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు అయన వేంట ఉన్నారు.
Spread the love