నవతెలంగాణ – హైదరాబాద్: సీనియర్ నటుడు శరత్ బాబు కూడా మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు… హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. అనంతరం చెన్నైకి తరలించారు. శరత్ బాబు భౌతికకాయం చెన్నైలోని టీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంది. ఈ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చెన్నైలో ఉన్న పలువురు సినీ ప్రముఖులు శరత్ బాబు నివాసానికి వెళ్లి ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.