
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేస్తున్న రుణమాఫీలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షులు సరిన్ ఆధ్వర్యంలో జన్నేపల్లి కెనరా బ్యాంక్ మేనేజర్ మదును కలిసి శనివారం విన్నవించారు. రైతుల రుణమాఫీలో రేషన్ కార్డులో పేరు లేదని తప్పులు దొర్లాయని చెబుతూ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారని వెంటనే అటువంటి రైతులకు రుణమాఫీ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదినాథ్, ప్రదీప్ గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.