విద్యా వ్యవస్థపై సర్కార్ నిర్లక్ష్య ధోరణి..

– గడ్డం ప్రవీణ్ బివిఎఫ్  మండల కన్వీనర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యా వ్యవస్థ పై సర్కారు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని బివిఎఫ్ మండల కన్వీనర్ గడ్డం ప్రవీణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం నుండి బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్న బహుజన విద్యార్థి గర్జన సభకు విద్యార్థులు బయలుదేరి వెళ్లారు. వెళుతున్న విద్యార్థులను ఉద్దేశించి ప్రవీణ్ మాట్లాడుతూ బహుజన బిడ్డలారా, పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యావ్యవస్థ పూర్తిగా విఫలమయ్యిందని, ఉద్యమకాలంలో కేసిఆర్ ఇచ్చిన కేజీ టూ పీజీ హామీ నినాదం పత్తాకు లేదు. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగానికి వార్షిక బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో విద్యావ్యవస్థపై సర్కార్ తన నిర్లక్ష్య ధోరణిని చాటుకుందని,ఇక మృత్యు నిలయాలుగా వసతి గృహాలు, సమస్యల నిలయాలుగా సర్కారీ బడులు కొన ఊపిరితో కొట్టు కొట్టుమిట్టాడుతున్ననాయి,ఇకనైనా తెలంగాణ విద్యార్థులు, ప్రజలు ఆలోచించి ఈ  బి ఆర్ ఎస్ ప్రభుత్వ బందిఅయిన  విద్యావ్యవస్థను పరిరక్షించి పేద, మధ్యతరగతి బిడ్డలైన బహుజనులకు నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్  నాయకత్వంలో అలుపెరుగకుండా పోరాడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్,అసెంబ్లీ నాయకులు, మరియు మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love