సర్కార్ చదువులకు నూతన ఒరవడి..

– మండలంలో ఘనంగా విద్యా దినోత్సవ సంబురాలు
– రాగి జావ,డీజీటల్ తరగతులు,గ్రంథలయాలు ప్రారంభం
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని అయా గ్రామాల పాఠశాలల్లో విద్యా దినోత్సవ సంబురాలు మంగళవారం ఘనంగా జరిగాయి.అయా పాఠశాలల్లోని విద్యార్థులు ప్రధాన వెదురుతో ర్యాలి నిర్వహించారు.అనంతరం అయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు.మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కడగండ్ల కవిత, సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, ఎంపీటీసీ గుభిరే శారధ కలిసి డీజీటల్ తరగతుల విద్యా బోధనను ప్రారంభించారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.చీలాపూర్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యా దినోత్సవం సందర్భంగా మండలంలోని అయా పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎంఈఓ పావని, అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ముత్తన్నపేటలో ..
ముత్తన్నపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ అధ్వర్యంలో నిర్వహించిన విద్యా దినోత్సవ వేడుకలు ప్రత్యేకతను చాటాయి.స్వాతంత్ర్య సమరయోదులు మహాత్మ గాందీ, నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్, సుభాశ్ చంద్రబోస్, చంద్రశేఖర్ అజాద్, జ్యోతిరావ్ ఫులె, సావిత్రి బాయి ఫులె, తెలంగాణ తల్లి వేషధారణలు విద్యా దినోత్సవ ర్యాలిలో ప్రత్యేకార్షణగా నిలిచాయి.

Spread the love