గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి.?

– సర్పంచ్ ,గిరికి, ఆసక్తి చూపుతున్న యువత
నవతెలంగాణ-మల్హర్ రావు : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పండుగ ముగిసింది.ఇప్పుడు మరో ఎన్నికల పండుగకు ముహూర్తం ఖరారైంది.అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలు పోటీపడగా కాంగ్రెస్ అభ్యర్ధి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అత్యధిక మెజార్టీతో గెలుపొంది, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు.ఈ క్రమంలో బిఆర్ఎస్,బిజెపి,బిఎస్పీ పార్టీలకు ఓటమికి గురై షాక్ కు గురైయ్యాయి.ఓటమి షాక్ నుంచి తెరుకోకముందే సర్పంచ్ ఎన్నికల నగారా మొగనుంది.సర్పంచ్ గిరి కోసం యువత గ్రామాల్లో ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో 15 మంది సర్పంచ్ లు, 128 వార్డులు,ఏడూ ఎంపిటిసిలు,ఒక జెడ్పిటిసి ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలకు ఎన్నికల రెండవ పరీక్ష మొదలు కానుంది.సర్పంచ్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారోని ఇప్పటికే గ్రామాల్లో చర్చలు మొదలైయ్యాయి.2019 స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ లు బిఆర్ఎస్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.ఎంపిటిసి సభ్యులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఎన్నికయ్యారు.అయితే వీరి పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31 వరకు ముగియనుండడంతో ఈసారి ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా యువత బరిలో ఉండడానికి ఆసక్తి కనబరుస్తు సమాయత్తం అవుతున్నారు.ఈ ఎన్నికల్లో ఎక్కువగా యువత సర్పంచ్ అభ్యర్థి పోటీలోకి ముందుకు వస్తే మండలంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
Spread the love