నవతెలంగాణ – నవీపేట్: జిల్లాలో సర్పంచ్ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఆసోల్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం భేటి అయ్యారు. సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై గత నెల 20వ తేదీన చలో కలెక్టరేట్ తో పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టగా శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందించి పలు సమస్యలను ఏటిఎస్ శ్రీనివాస్ తో సమగ్రంగా చర్చించారు.సుమారు గంటన్నర పాటు సమస్యలపై జిల్లా పంచాయతీ రాజ్ అధికారిని జయసుధతో కలిసి కులంకషంగా చర్చించి రెండు వారాల్లో సర్పంచ్ లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఏటీఎస్ శ్రీనివాస్ కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…