నవతెలంగాణ – కోహెడ
ప్రభుత్వ పాఠశాలలలోనే నాణ్యమైన విద్య అందుతుందని కూరెళ్ల గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని కూరెళ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ బత్తిని శ్రీలత బిక్షపతి గౌడ్, వార్డు సభ్యులు గాజుల రవీందర్, ఈగ మల్లయ్య, కోనవేణి మంజుల రాజు, ఇట్టవేణి రేణుక కొమురయ్య, సంపంగి రామచంద్రం, పొన్నాల రవీందర్, బత్తిని వెంకన్న, పొన్నాల భాస్కర్, తిరుపతి, ప్రధానోపాధ్యాయుడు వసంత్ నాయక్, బిట్ల శ్రీనివాస్, బండారి సంగీత, తదితరులు పాల్గొన్నారు.