నవతెలంగాణ- శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన
కన్నాపూర్ గ్రామ సర్పంచ్ కాటం వెంకటరమణ రెడ్డి, ఉపాధ్యాయుల దినోత్సవంలొ ఉపాధ్యాయులను శాలువాలతో మంగళవారం ఘనంగా సన్మానించారు.అనంతరం ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ చైర్మన్ పంజాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.