ఆధారాలు లేవని కేసు నమోదు చేయలేదు: సర్పంచ్ నవ్య

నవతెలంగాణ-ధర్మసాగర్
పోలీసులు తగిన ఆధారాలు లేవని (ఎఫ్ఐఆర్) కేసు నమోదు చేయలేదని సర్పంచ్ ఎమ్మెల్యే నవ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య అనుచిత వాక్యాలకు గత బుధవారం ఆయనపై మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన విషయం విధితమే. ఈ విషయం పైన ఇప్పటివరకు కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోలేదని స్థానిక సీఐ ఒంటేరు రమేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు వేసిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇలా ఇచ్చారు.
1.మీకై మీరు వచ్చారా లేదా పోలీసులు పిలిస్తే వచ్చారా అనే ప్రశ్నకు.?
స్థానిక ఎమ్మెల్యే వారి అనుచరులైన స్థానిక ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి, ఆయన పిఏ శ్రీనివాస్, మాట్లాడిన మాటలను సిఐ గారికి ప్రత్యక్షంగా వినిపించడం జరిగిందని అందుకు ఆయన ఈ కేసు సంసిద్ధంగా మారిందని,తగిన పూర్తి ఆధారాలు ఇచ్చిన మేరకే కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారని ఆరోపించారు.ఎమ్మెల్యే మరియు అతని పిఏ,ఎంపీపీ స్వయంగా మమ్మల్ని మభ్య పెట్టడానికి మాట్లాడిన మాటలను స్వయంగా వినిపించినప్పటికీ, కేసు నమోదు చేయకపోవడం ఎమ్మెల్యే గారి హుకుం అర్థమవుతుందని తెలియజేశారు.
 2.అందుకు విలేకరులు మీకు కావాల్సినది ఏమిటి అని ప్రశ్నించగా?
గ్రామ అభివృద్ధి మా లక్ష్యంగా మీ ముందుకు సాగుతున్నామని ఆయన 25 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని చెప్పారు. ఇప్పటివరకు ఇచ్చిన దాఖలు లేవని సమాధానం తెలిపారు.
3. 25 లక్షలు ఇస్తే మీరు కేసు వాపస్ తీసుకుంటారని?
వెంటనే సమాధానం చెప్పలేకపోయారు.
4.మీ భర్త పైన కేసు నమోదు చేసిన… ఇప్పుడు మితో కలిసి మాట్లాడడం అంతర్యం ఏమిటి?
తను నా భర్తగా నా ఇంట్లో విధులు, బాధ్యతలు నిర్వహిస్తూ, నాకు న్యాయం చేయడానికి వచ్చారని, తను అందులో తను పాల్గొనడం నేరమేనని సమాధానం ఇచ్చారు.ఇప్పటికైనా నాకు తగిన న్యాయం చేయాలని మీ మీడియా ముందుకు వచ్చానని సమాధానం తెలిపారు.
ఇందుకు సంబంధించి తన పిఏ శ్రీనివాస్ ను ప్రశ్నించగా చట్టం తన పని తాను చేసుకోపోతాదని, అందులో మేము మాట్లాడింది ఏమీ లేదని సమాధానం ఇచ్చారు.

Spread the love