నవతెలంగాణ- గోవిందరావుపేట
మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం గొయ్యిలో పడిన ఆవును సర్పంచ్ తో పాటు పంచాయతీ సిబ్బంది బయటకు తీసి కాపాడారు. స్థానికులు ప్రకారం గ్రామంలోని ఒక వీధిలో లెట్రిన్ నిర్మాణం కొరకు కొరకు గోయ్యి తీసి ఉంచారు. చాలా రోజులు కావడంతో గొయ్యి వర్షపు నీటితో నిండిపోవడం దాని చుట్టూ పచ్చటి గడ్డి పెరగడంతో మేత కొరకు ఆ దిశగా వచ్చిన ఒక ఆవు ప్రమాదవశాత్తు ఆ గోతిలో పడి పోయింది. అటుగా వెళ్లిన వాళ్లు నీటి గుంతలో ఉన్న ఆవు ను చూసి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన సర్పంచ్ మరియు సిబ్బంది తాళ్ల సహాయంతో అవును పైకి తీసి ప్రాణాపాయం తప్పించారు. అవును కాపాడిన సర్పంచ్ మరియు పంచాయతీ సిబ్బందికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.