నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పందిల్ల గ్రామ సర్పంచ్ రమేష్ గ్రామానికి అందించిన సేవలు అభినందనీయమని ఆదర్శ సొసైటీ సభ్యులు అన్నారు శుక్రవారం పందిల్ల గ్రామంలో మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ ను సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తీసుకువచ్చాడని కొనియాడారు. గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి మండలంలో ఆదర్శంగా నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సొసైటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.