బహుజన రాజ్యస్థాపనే సర్వాయి పాపన్న ఆశయం

Sarvai Papanna's ambition is to establish a Bahujan Rajya– ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-లింగాలఘనపురం
బహుజన బందూకు సర్వాయి పాపన్నఅని, బహుజన రాజ్యస్థాపనే సర్వాయి పాపన్న అశయమని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని నవాబుపేట గ్రామంలో సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమి టీ, గౌడ సంఘం-నవాబుపేట ఆధ్వర్యంలో తొలి బహుజన మహారాజు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ తొలిమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.స్థానిక సర్పంచ్‌ బుడిది జయ-రాజేశ్వర్‌ గౌడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ క్రీ.శ.1650 సంవత్సరంలో గౌడ కు లంలో జన్మించి, సర్వాయి పాపాపన్న కులవత్తి చేసుకుంటూనే తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహకరిస్తూ ఆనాడు మొఘల్‌ సామ్రాజ్యంలో ఉన్న సైనికులు, ర జాకారులు, భూస్వాములు జాగీర్దారులు బలవంతంగా పన్నులు వసూలు చేయ డం ఆయన కల్లుగీత కార్మికునిగా ఉన్నప్పుడు కల్లు తాగి సైనికులు డబ్బులు అడిగి తే కొట్టే దౌర్జన్యాన్ని సహించలేక బహుజన నాయకుడిగా ఒక గౌడ కులంలో పుట్టి చదువు లేకున్నా మరి ఒక మిలిటెంట్‌ సైన్యాన్ని తయారు చేసుకొని తనను తాను రాజుగా ప్రకటించుకుని 12 మంది తోటి ముందు మొదలుపెట్టి 12000 సైన్యా న్ని సమకూర్చుకొని కొడితే గోల్కొండనే కొట్టాలి అని ఆయన దాదాపు వరంగల్‌ కాకతీయ కోటతో మొదలుకొని దాదాపు మధ్యలో ఇరవై ఒక్క కోటాలను నిర్మించి చివరికి గోల్కొండ కోట మీద జెండా పాతిన వీరుడు మరి సర్దార్‌ పాపన్న 1650 లో పుట్టి అదేవిధంగా మన ఖిలాషాపూర్‌లో మరి ఆయన రాజధాని స్థాపించి ఐదు సంవత్సరాలు దాదాపు కోట నిర్మాణం జరిగింది. దానికంటే ఐదు సంవత్సరాల ముందు తాటికొండలో దర్బార్‌, రక్షణ కోసం గుట్టమీద మరి రక్షణ కేంద్రంగా కార్యక్రమాలు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం బీదవాళ్ళ కోసం ఆ యన పాటుపడ్డాడు కానీ ఆయన బహుజన నాయకుడు కాబట్టే దాదాపు 350 సంవత్సరాలు ఆయన జీవితం మరుగున పడిపోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపిపి చిట్ల జయశ్రీ ఉపేందర్‌ రెడ్డి, ఎంపిటిసి సిద్దులు, మండల పార్టీ అధ్య క్షుడు శ్రీనివాస్‌, భాగ్యలక్ష్మి, శ్రీవారి, విష్ణు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, గౌడ సంఘం నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love