అమరావతి : తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు వున్నాయని ఏకంగా సిఎం చంద్రబాబు నాయుడే ఇటీవల ప్రకటన చేయడంతో ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. టిటిడి తయారు చేసే లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో కల్తీపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించింది. అలాగే సిట్‌లో విశాఖ రేంజ్ డిఐజి గోపినాథ్‌జెట్టి, కడప ఎస్‌పి హర్షవర్ధన్‌తో పాటు మరికొందరు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు సభ్యులుగా వుండనున్నారు.