శీతక్కను విమర్శించే స్థాయి సతీష్ రెడ్డికి లేదు

– పాలడుగు వెంకట కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు..
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు ఎమ్మెల్యే సీతక్కలు విమర్శించే స్థాయి రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ఇన్చార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. సీతక్క నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రతి ప్రజా సమస్యపై ప్రజా గళం వినిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆదివాసీ గిరిజన నాయకురాలు అని అన్నారు. ప్రజల అభిమానంతో ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుని కీర్తి, ప్రతిష్టలు సంపాదించారు తప్ప, శవ రాజకీయాలు చేసే వ్యక్తిత్వం సీతక్క ది కాదని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్ష పదవి కోసం, ఎమ్మేల్యే పదవుల కోసం జగదీష్ పై ఒత్తిడి తెచ్చి మృతికి పరోక్షంగా కారణం అయ్యారని అన్నారు. సీతక్క ని విమర్శించే స్థాయి కానీ, విలువలు కానీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి కి లేదని, శవ రాజకీయాలు చేసింది మీరని, జగదీష్ చనిపోయి పది రోజులు కాకముందే పదవులు పంచుకుంటూ నైతిక విలువలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నది మీరని అన్నారు. సీతక్క ప్రజా సేవ చేశారు తప్ప, మీ నాయకుల లాగా భూ దందాలు, అక్రమ మైనింగ్, మోసాలు చేయలేదని అన్నారు. వెంటనే సీతక్క పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సతీష్ రెడ్డి ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి సీతక్క గారిపై అసత్య ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జంపాల చంద్రశేఖర్, వేల్పుగొండ ప్రకాష్, పొన్నం సాయి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love